వార్తలకు తిరిగి వెళ్లండి

పాతబస్తీలోని బహదూర్‌పురా కిషన్‌బాగ్‌లో గల ఒక సోఫా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు వేగంగా వ్యాపిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు, ఆస్తి నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

