వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూల్ మండలంలోని ఎండబెట్ల, ఉయ్యాలవాడ, నాగనూల్ గ్రామాలకు చెందిన పలువురు వర్క్ ఫ్రమ్ హోం పేరుతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయినట్లు ఫిర్యాదు చేశారు. పీచు తయారీ మెటీరియల్ ఇస్తామని, అధిక లాభాలు వస్తాయని చెప్పి డబ్బులు తీసుకున్నట్లు తెలిపారు.
తర్వాత మెటీరియల్, జీతాలు ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

