Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యాలమ్మ జాతరలో బోనం ఎత్తిన మహిళా SI

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 8:47 AM తూర్పుగోదావరి General
ముత్యాలమ్మ జాతరలో బోనం ఎత్తిన మహిళా SI - Udayam
గోకవరం మండలం పెంటపల్లిలో శ్రీముత్యాలమ్మ అమ్మవారి జాతరను మంగళవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. సుమారు 500 మంది మహిళలు బోనాలు ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోకవరం మహిళా ఎస్‌ఐ భూక్య నాగమణి సైతం బోనం ఎత్తుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆమె ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపింది.

Comments

G
Loading comments...