Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భార్య ఫోన్‌తో నకిలీ డీఎస్పీ చిక్కాడు

Follow Udayam on Google
SHRUTHI Aug 25, 2026 6:32 AM హైదరాబాద్General
భార్య ఫోన్‌తో నకిలీ డీఎస్పీ చిక్కాడు - Udayam
తిరుపతి డీఎస్పీనని నమ్మించి పెట్టుబడుల పేరుతో రూ.కోట్లు వసూలు చేసిన కేవీపీ రాజును హైదరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు బెంగళూరులో అరెస్ట్‌ చేశారు. నకిలీ గుర్తింపు కార్డుతో పలువురిని మోసగించినట్లు పోలీసులు తెలిపారు. ఐదేళ్లుగా పరారీలో ఉన్న రాజు పాత కాల్‌డేటాను పరిశీలించగా, అందులోని ఓ నంబరును అతడి భార్య వినియోగిస్తున్నట్లు గుర్తించారు. దాని ఆధారంగా ఆచూకీ గుర్తించి నిందితుడిని పట్టుకున్నారు.

Comments

G
Loading comments...