Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రజత పతక విజేత అజయబాబుకు ఘన స్వాగతం

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 08, 2026 2:11 PM విజయనగరంGeneral
రజత పతక విజేత అజయబాబుకు ఘన స్వాగతం - Udayam
కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం సాధించిన నెల్లిమర్ల మండలం కొండవెలగాడకు చెందిన వల్లూరు అజయబాబుకు శుక్రవారం ఘన స్వాగతం లభించింది. విజయనగరం నుంచి స్వగ్రామం వరకు గ్రామస్థులు, క్రీడాకారులు, అభిమానులు ఊరేగింపుగా తీసుకెళ్లారు. సంతకాల వంతెన నుంచి కోట, మూడులాంతర్లు, పైడితల్లి ఆలయం, గంటస్తంభం మీదుగా ఓపెన్‌ టాప్‌ జీపులో ఊరేగింపు సాగింది. గ్రామ సమీపం నుంచి కోలాటం, డీజేతో స్వాగతం కొనసాగింది.

Comments

G
Loading comments...