వార్తలకు తిరిగి వెళ్లండి

దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 38 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేసి దాదాపు 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యమన్నారు.
వరంగల్, కరీంనగర్, జనగామ, యాదాద్రి, సూర్యాపేట, సిద్దిపేట, ములుగు, భూపాలపల్లి జిల్లాలకు ప్రాజెక్టుతో ప్రయోజనం ఉంటుందన్నారు. భూసేకరణలో జాప్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

