Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన మంత్రి వాకిటి

Follow Udayam on Google
Harika Aug 26, 2026 11:09 AM నారాయణపేటGeneral
ఇందిరమ్మ ఇండ్లను  ప్రారంభించిన మంత్రి వాకిటి  - Udayam
మక్తల్ మండలం గోలపల్లి గ్రామంలో పొర్ల నరేష్ నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. నరేష్ తన ఇంటికి మంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయించి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నరేష్‌ను అభినందించి, వాకిటి వారి కానుకను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...