Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కావాలి అంటే నా రక్తం తీసుకో.. కానీ రైతులకు నీళ్లు ఇవ్వు

Follow Udayam on Google
రచన దేవి Jul 19, 2026 9:10 PM సిద్దిపేటGeneral
కావాలి అంటే నా రక్తం తీసుకో.. కానీ రైతులకు నీళ్లు ఇవ్వు - Udayam
కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కరువు వల్లే సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో జరిగిన రైతుల మహా పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. "కావాలంటే నా రక్తం తీసుకో.. కానీ రైతులకు నీళ్లు ఇవ్వు" అని ముఖ్యమంత్రిని ఉద్దేశించి అన్నారు. 70 టీఎంసీల నీటిని వృథాగా వదిలేసి రంగనాయక సాగర్‌ను ఎండబెట్టారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాళేశ్వరం మోటర్లు ఆన్ చేయాలని, లేనిపక్షంలో రైతుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.

Comments

G
Loading comments...