వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధులను గౌరవించడం అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ కీమ్యా నాయక్ అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల వారోత్సవాల్లో భాగంగా వనపర్తి పాలిటెక్నిక్ మైదానం నుంచి బుధవారం అవగాహన ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ అంబేడ్కర్ చౌరస్తా వరకు సాగింది.
వృద్ధుల పట్ల దయతో వ్యవహరించి, వారి మానసిక స్థితిని అర్థం చేసుకోవాలని కీమ్యా నాయక్ సూచించారు. కార్యక్రమంలో డీడబ్ల్యూవో సుధారాణి పాల్గొన్నారు.
Comments
Loading comments...

