Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సిగరెట్ నిప్పు అంటుకొని వృద్ధుడు మృతి

Follow Udayam on Google
K. Anuradha Sep 30, 2026 2:30 PM శ్రీకాకుళంGeneral
సిగరెట్ నిప్పు అంటుకొని వృద్ధుడు మృతి - Udayam
శ్రీకాకుళం వాంబే కాలనీలో పలిశెట్టి నరసింహమూర్తి అలియాస్ పిచ్చి రమణ(63) మంటల్లో కాలిపోయి బుధవారం మృతి చెందాడు. ఒంటరిగా నివసిస్తున్న రమణ మద్యం, సిగరెట్లకు బానిసగా ఉండేవాడని స్థానికులు తెలిపారు. సిగరెట్ కాలుస్తూ నిద్రపోవడంతో మంటలు చెలరేగి ప్రమాదం జరిగి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇంటి సామగ్రితో పాటు ఓ ద్విచక్ర వాహనం కూడా దగ్ధమైంది. ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...