వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రకాశం జిల్లా జరుగుమల్లి కేజీబీవీ విద్యార్థినులను వంటమనిషి ఓ వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అప్పగించినట్లు ఆరోపణలు వచ్చాయి. అక్కడ సదరు వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడంతో భయపడిన విద్యార్థినులు బయటకు పరుగెత్తి స్థానికులకు విషయం తెలిపారు.
దీంతో విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు నిందితుడి ఇంటిపై దాడి చేశారు. డీఆర్డీఏలో పనిచేసి రిటైర్ అయిన వెంకటేశ్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Loading comments...

