Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంటగదుల్లో అపరిశుభ్రత.. ఆరు హోటళ్లకు షాక్

Follow Udayam on Google
Saychi Kumar Oct 07, 2026 9:34 AM కామరెడ్డిGeneral
వంటగదుల్లో అపరిశుభ్రత.. ఆరు హోటళ్లకు షాక్ - Udayam
జాతీయ రహదారి-44 వెంట టీజీ సేఫ్ అధికారులు మంగళవారం నిర్వహించిన తనిఖీల్లో ఆహార భద్రతా ఉల్లంఘనలు గుర్తించారు. కామారెడ్డి జిల్లాలోని ఎనిమిది రెస్టారెంట్లలో పరిశుభ్రత లోపాలు, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, కీటకాల ఉనికిని గుర్తించి ఆరు సంస్థల లైసెన్సులను సస్పెండ్ చేశారు. మరో రెండు సంస్థలకు నోటీసులు జారీ చేశారు. మెదక్, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాల్లో 20 సంస్థలను తనిఖీ చేసి, 21 ఆహార నమూనాలను సేకరించారు.

Comments

G
Loading comments...