వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కుంటాల మండలం విట్టాపూర్ గ్రామంలో ఆదివారం పిడుగుపాటు చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు గొర్రెలు మృతి చెందగా, ఇద్దరు గొర్రెల కాపరులకు గాయాలయ్యాయి. గమనించిన గ్రామస్థులు క్షతగాత్రులను వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పిడుగుపాటుతో గ్రామంలో ఆందోళన నెలకొంది.
Comments
Loading comments...

