Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి

Follow Udayam on Google
BALAJI SRIMANGALI Sep 17, 2026 3:05 PM సంగారెడ్డిGeneral
వినాయక నిమజ్జనంలో జాగ్రత్తలు పాటించాలి - Udayam
నాగల్‌గిద్ద మండలంలో వినాయక నిమజ్జనంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఎస్సై కాశీపురం రామకృష్ణ సూచించారు. చిన్నపిల్లలను చెరువులు, బావుల వద్దకు తీసుకురావద్దన్నారు. అవాంఛనీయ ఘటనలు జరిగితే వినాయక కమిటీలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. ముందస్తుగా ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనవద్దని కోరారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

Comments

G
Loading comments...