Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడలో 72 అడుగుల మహాగణపతి విగ్రహం

Follow Udayam on Google
SHRUTHI Sep 14, 2026 6:48 AM విజయనగరంGeneral
విజయవాడలో 72 అడుగుల మహాగణపతి విగ్రహం - Udayam
విజయవాడ లేబరుకాలనీ మైదానంలో డూండీ గణేశ్ సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగుల పర్యావరణహిత శ్రీపంచముఖ వరసిద్ధి మహాగణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల పద్నాలుగు నుంచి ఇరవై నాల్గవ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన వినాయకుడి ఆగమన కార్యక్రమంలో మంత్రి సవిత హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా మహిళలతో కలిసి కోలాటం ఆడి అందరినీ ఉత్సాహపరిచారు.

Comments

G
Loading comments...