వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ స్తంభం పడి మహిళ మృతి చెందిన ఘటన తెర్లాం మండలంలో జరిగింది. వివరాల ప్రకారం ఆమిటి గ్రామానికి చెందిన ఎం.అచ్చియ్యమ్మపై ఇంటి సమీపంలో ఉన్న చెట్టు గాలికి ఇంటిపై పడిపోతుందన్న భయంతో గురువారం చెట్టును కొట్టారు.
ఈ క్రమంలో చెట్టు విద్యుత్ వైర్లపై పడడంతో స్తంభం పడిపోయింది. మహిళపై స్తంభం పడడంతో ఆమె మృతి చెందింది. ఈ సందర్భంగా శుక్రవారం మృతురాలు కుటుంబాన్ని బొబ్బిలి బేబినాయన పరామర్శించి ఓదార్చారు.
Comments
Loading comments...

