వార్తలకు తిరిగి వెళ్లండి

ఆముదాలవలస పట్టణంలో ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంటను శక్తి టీమ్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. అనుమానాస్పదంగా ఉన్న జంటను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారి వద్ద ఉన్న పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించరనే భయంతో ఇళ్ల నుంచి వచ్చిన జంట, డబ్బులు లేక ఆత్మహత్యకు యత్నించినట్లు విచారణలో వెల్లడైంది.
Comments
Loading comments...

