వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలంలో శుక్రవారం రాత్రి ఘోర విషాదం చోటు చేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. రాత్రి కురిసిన వర్షానికి కల్వకుర్తిలోని గాంధీ నగర్ లో ఏర్పాటుచేసిన వినాయక మండపం దగ్గర కాషాయపు జెండా విద్యుత్ తీగల కు తగిలింది. దాని తొలగించే సమయంలో తర్నికల్ గ్రామానికి చెందిన మండల బీజేవైఎం ప్రధాన కార్యదర్శి జంపుల అరవింద్ (26) విద్యుత్ షాక్ తో మృతి చెందారు. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Comments
Loading comments...

