Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ సరఫరా నాణ్యత, భద్రతకు 33 కేవీ కవర్డ్ కండక్టర్ లైన్

Follow Udayam on Google
Devender Bale Sep 19, 2026 10:06 PM జగిత్యాలGeneral
విద్యుత్ సరఫరా నాణ్యత, భద్రతకు 33 కేవీ కవర్డ్ కండక్టర్ లైన్ - Udayam
రామన్నపేట సెక్షన్లోని 33కేవీ తిర్మలాపూర్ ఫీడర్‌పై సుమారు 3కి.మీ. కవర్డ్ కండక్టర్ లైన్‌ను ఎస్ఈ బి.సుదర్శనం శనివారం ఛార్జ్ చేశారు. విద్యుత్ లైన్ల భద్రత పెరగడంతో పాటు చెట్ల కొమ్మలు, గాలుల కారణంగా ఏర్పడే అంతరాయాలను తగ్గించవచ్చన్నారు. వినియోగదారులకు మరింత నాణ్యమైన, విశ్వసనీయ విద్యుత్ సరఫరా అందించవచ్చని తెలిపారు. డీఈ గంగారాం, ఏడీఈ మహేందర్, ఏఈ శ్రీనివాస్, సిబ్బంది, కాంట్రాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...