వార్తలకు తిరిగి వెళ్లండి

నిజాంపేట మండలం బచ్చురాజుపల్లి రైతులు విద్యుత్ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు. తరచూ విద్యుత్ అంతరాయాలతో ఎండల తీవ్రతకు బోరు మోటార్ల నుంచి నీరు సరిగా రావడం లేదని, పంటలకు నీరందక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు రోజుల క్రితం రాత్రి 12 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు విద్యుత్ సరఫరా చేశారని తెలిపారు. అదే విధానాన్ని కొనసాగించి పంటలకు నీరందేలా చూడాలని కోరారు.
Comments
Loading comments...

