Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వెంగన్నపల్లిలో చెత్తకు చెక్‌

Follow Udayam on Google
Dinesh Kumar Sep 29, 2026 4:57 PM చిత్తూరుGeneral
వెంగన్నపల్లిలో చెత్తకు చెక్‌  - Udayam
చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వెంగన్నపల్లి 50వ వార్డులో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. పీహెచ్ మేస్త్రి కే. రాంబాబు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య సిబ్బంది వీధుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. తడి చెత్త, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్య నిర్వహణ చేపట్టారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు నిరంతరం పారిశుద్ధ్య పనులు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...