Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త భవనంలో సెంట్రల్‌ లైబ్రరీకి చోటేది?

Follow Udayam on Google
Sai Nath Sep 29, 2026 6:40 PM జాతీయంGeneral
కొత్త భవనంలో సెంట్రల్‌ లైబ్రరీకి చోటేది? - Udayam
సెంట్రల్‌ విస్టా పునర్వ్యవస్థీకరణలో భాగంగా శాస్త్రి భవన్‌ను కూల్చివేయనుండటంతో 1891లో ఏర్పాటైన సెంట్రల్‌ సెక్రటేరియట్‌ లైబ్రరీకి కొత్త స్థలం ఇంకా ఖరారు కాలేదు. హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ అఫైర్స్‌ మంత్రిత్వ శాఖ, సీపీడబ్ల్యూలో స్థలం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నాలుగు అంతస్తుల్లో దాదాపు 5,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ లైబ్రరీలో 8.5 లక్షలకు పైగా పుస్తకాలు, అరుదైన గ్రంథాలు ఉన్నాయి.

Comments

G
Loading comments...