వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండ్రాజవరం మండలం వేలివెన్నులో భూగర్భ డ్రైనేజీ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మండలంలోనే తొలిసారిగా గ్రామమంతా భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కలిగిన గ్రామంగా వేలివెన్ను గుర్తింపు పొందింది. కాలనీల్లో పనులు ఇప్పటికే పూర్తయ్యాయి.
ప్రస్తుతం ప్రధాన రహదారికి ఒకవైపు డ్రైనేజీ నిర్మాణం కొనసాగుతోంది. వ్యవస్థ అందుబాటులోకి వస్తే వర్షపు నీరు, మురుగునీరు నిల్వ లేకుండా పారడంతో పారిశుద్ధ్యం మెరుగుపడనుంది.
Comments
Loading comments...

