వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామ ప్రధాన రహదారి నిన్న కురిసిన వర్షానికి బురదమయంగా మారింది. దీంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామం నుంచి మాగి ఎక్స్ రోడ్డు వరకు ఉన్న ప్రధాన రహదారి ఇప్పటికే గుంతలమయంగా ఉండగా, వర్షంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారింది. రహదారికి మరమ్మతులు చేపట్టి ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

