Udayam Digital
Menu

వైద్య విద్యలో ఏపీ బాలికలదే పైచేయి

Sai Nath Nov 19, 2026 6:00 PM అమరావతిGeneral
వైద్య విద్యలో ఏపీ బాలికలదే పైచేయి - Udayam Digital
వైద్య విద్యలో ఆంధ్రప్రదేశ్‌ బాలికలు అగ్రస్థానంలో నిలవడం గర్వకారణమని సీఎం చంద్రబాబు అన్నారు. ఎంబీబీఎస్‌ రాష్ట్ర కోటా సీట్లలో 61.34 శాతం బాలికలు, 38.66 శాతం బాలురు సాధించారని తెలిపారు. ఇది బాలికల ప్రతిభ, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు. . ప్రతి ఆడబిడ్డకు సమాన అవకాశాలు కల్పిస్తూ, ఉన్నత లక్ష్యాలు సాధించి నాయకత్వ స్థానాలకు ఎదిగేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని భరోసా ఇచ్చారు.

Comments

G
Loading comments...