వార్తలకు తిరిగి వెళ్లండి

సంతబొమ్మాళి మండలం బోరుభద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ప్రజలు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
డాక్టర్ చిరంజీవి ఆధ్వర్యంలో శనివారం వైద్య సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పించారు. వేడి చేసి చల్లార్చిన నీటినే తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆరోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి చికిత్స పొందాలని తెలిపారు.
Comments
Loading comments...

