Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే గదిలో ఇద్దరి మృతి

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 12, 2026 8:17 AM మెదక్General
ఒకే గదిలో ఇద్దరి మృతి - Udayam
వికారాబాద్‌ జిల్లా యాలాల మండలం కోకట్‌ శివారులో అబ్దుల్‌ లియాఖత్‌(42), గోరెప్ప(32) అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. సోమవారం రాత్రి మద్యం, కల్లు తాగి భోజనం చేసిన అనంతరం ఒకే గదిలో నిద్రించిన వీరిద్దరూ వాంతులు, విరేచనాలతో ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాల పక్కన మద్యం సీసాలు, కల్లు పొట్లాలను పోలీసులు గుర్తించారు. మద్యం, కల్లు లేదా ఫుడ్‌ పాయిజనింగ్‌ మరణాలకు కారణమా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...