వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్నబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో మందస మండలంలోని బుడంబో, సాబకోట, చీపి, నర్సింగపురం తదితర పంచాయతీల్లో టీడీపీ కూటమి నాయకులు గురువారం పర్యటించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి బాధితులకు ధైర్యం చెప్పారు. చెరువులు, ఆనకట్టల నీటిమట్టాలను సమీక్షించారు.
మండల టీడీపీ అధ్యక్షుడు బావన దుర్యోధన ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కార్యకర్తలు సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
Comments
Loading comments...

