వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 15న అర్వపల్లిలో బీఆర్ఎస్ తుంగతుర్తి నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుంది. మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
నియోజకవర్గంలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు ఈ సమావేశంలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అర్వపల్లి మండల నాయకుడు గుండగాని సోమేశ్ గౌడ్ కోరారు.
Comments
Loading comments...

