Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తుంగభద్రకు తగ్గిన వరద ప్రవాహం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Aug 08, 2026 11:56 AM కర్నూలుGeneral
తుంగభద్రకు తగ్గిన వరద ప్రవాహం - Udayam
తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టిందని టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు 42,114 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగింది. 1,623.68 అడుగుల నీటిమట్టానికి గాను 72.26 టీఎంసీల నిల్వ ఉందన్నారు. తాగునీటి అవసరాల కోసం వివిధ కాల్వలకు 1,514 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగునీటి విడుదలపై ఈనెల 11న కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

Comments

G
Loading comments...