వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని భీవండి పట్టణంలో కొమురవెల్లి మల్లన్న ఆలయ నమూనాలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేశారు. స్వామివారి మూలవిరాట్, గంగిరేగి చెట్టు, రాజగోపురం రూపాలను కొమురవెల్లి ఆలయం తరహాలో తీర్చిదిద్దారు.
మండపం వద్ద తెలుగులో బోర్డును కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మల్లన్న ఖ్యాతి ఇతర రాష్ట్రాలకు వ్యాపించడంపై తెలంగాణ భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

