వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్ మట్టెవాడలోని వేణుగోపాలస్వామి ఆలయంలో బాల గణేశ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా 216 రకాల నైవేద్యాలను సమర్పించారు. అనంతరం పెద్ద సంఖ్యలో భక్తులు గణనాథుడిని దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ పరిసరాలు భక్తుల సందడితో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
Comments
Loading comments...

