వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి ఆలయంలో కళ్యాణం వైభవంగా జరిగింది. భాద్రపద శుద్ధ ఏకాదశిని పురస్కరించుకుని ఉష, పద్మిని, ఛాయ సమేతుడైన స్వామి వారికి మంగళవారం ఉదయం కళ్యాణం నిర్వహించారు.
వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అర్చకులు సందీప్ శర్మ కళ్యాణ ఘట్టం జరిపించారు. ప్రధాన అర్చకులు శంకర శర్మ, ఈవో ప్రసాద్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

