వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి రథోత్సవం వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు రథాన్ని లాగి స్వామివారి అనుగ్రహాన్ని పొందారు.
రథంపై స్వామివారు విహరిస్తుండగా భక్తులు అడుగడుగునా హారతులు సమర్పించారు. గోవిందనామ స్మరణతో తిరుమాడ వీధులు మారుమోగగా, రథోత్సవాన్ని వీక్షించిన భక్తులు పరవశించిపోయారు.
Comments
Loading comments...

