వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులు, ట్రాక్టర్ యజమానుల లెక్కల నిర్వహణకు జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన బేతి రాజు ‘ట్రాక్టర్ ఖాతా’ యాప్ను రూపొందించారు. న్యూజిలాండ్లో యాప్ తయారీలో శిక్షణ పొందిన ఆయన రైతుల ఇబ్బందులను గుర్తించి దీనిని అభివృద్ధి చేశారు.
ఈ యాప్లో పనులు, చెల్లింపులు, బకాయిలు, డీజిల్ ఖర్చులు నమోదు చేసుకోవచ్చు. క్లౌడ్లో సమాచారం భద్రంగా ఉంటుంది. త్వరలో హిందీలోనూ అందుబాటులోకి తేనున్నారు.
Comments
Loading comments...

