Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బెల్లంపల్లిలో గల్లీల ఆక్రమణ.. అత్యవసర సేవలకూ ఆటంకం

Follow Udayam on Google
Shruthi Oct 14, 2026 9:57 AM ఆదిలాబాద్General
బెల్లంపల్లిలో గల్లీల ఆక్రమణ.. అత్యవసర సేవలకూ ఆటంకం - Udayam
బెల్లంపల్లి పట్టణంలో గల్లీలు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలతో ప్రజల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. గాంధీ చౌక్‌ నుంచి డబ్బుసేట్‌ లైన్‌ వరకు పలుచోట్ల మెట్లు, ప్రహరీలు, పార్కింగ్‌ షెడ్లతో దారులు కుచించుకుపోయాయి. దీంతో అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లు, అగ్నిమాపక వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆక్రమణలపై సర్వే చేపట్టి అక్రమ నిర్మాణాలను తొలగిస్తామని మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేష్‌ తెలిపారు.

Comments

G
Loading comments...