Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలిలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య

Follow Udayam on Google
Raghu Oct 04, 2026 7:41 AM శ్రీకాకుళంGeneral
టెక్కలిలో రైల్వే ఉద్యోగి ఆత్మహత్య - Udayam
టెక్కలి మండలం రెయ్యిపేట గ్రామానికి చెందిన గేదెల నూకరాజు(52) శనివారం గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆయనను కుటుంబ సభ్యులు టెక్కలి జిల్లా ఆసుపత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.

Comments

G
Loading comments...