Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఎస్టీ కమిషన్‌ సభ్యుడి పర్యటన

Follow Udayam on Google
Harika Aug 24, 2026 10:44 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
జిల్లాలో ఎస్టీ కమిషన్‌ సభ్యుడి పర్యటన - Udayam
జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోత్‌ హుస్సేన్‌ నాయక్‌ సోమవారం, మంగళవారం జిల్లాలో పర్యటించనున్నారు. సోమవారం కూనవరంలో గిరిజనులతో సమావేశమై సమస్యలు తెలుసుకోనున్నారు. అనంతరం భారజల కర్మాగారంలో ఎస్టీ ఉద్యోగులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. మంగళవారం కలెక్టరేట్‌లో పెండింగ్‌ కేసులపై విచారణ చేపట్టి, అనంతరం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...