వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం వడ్రహొన్నూరు గ్రామ పొలాల్లో చిరుత సంచారం కలకలం రేపింది. రైతు మధు వేరుశనగ పొలంలో పని చేస్తుండగా పెద్ద వంకలో అలజడి వినిపించడంతో వెళ్లి చూడగా గడ్డిలో నుంచి చిరుత పరుగెత్తుతూ వెళ్లింది.
ఈ దృశ్యాలను సమీపంలోని గొర్రెల కాపరి ఫొటోలు తీశాడు. మొన్న మురడి వద్ద కూడా ఇదే చిరుత కనిపించిందని ఫారెస్టు అధికారి దామోదర్ తెలిపారు. కొండ వెంబడి చిరుత సంచరిస్తుండవచ్చని పేర్కొన్నారు.
Comments
Loading comments...

