వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ జోగు రమణమ్మ మంగళవారం మొక్కలు నాటారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లింగం, మాజీ ఎంపిటిసి రవీందర్ రెడ్డి, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

