Udayam Digital
Menu

తొలి రోజు కివీస్‌దే పైచేయి.. 243/5

Sai Nath Nov 19, 2026 11:29 AM జాతీయంక్రీడలు
తొలి రోజు కివీస్‌దే పైచేయి.. 243/5 - Udayam Digital
భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టెస్టు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి కివీస్‌ 5 వికెట్లకు 243 పరుగులు చేసింది. హెన్రీ నికోల్స్‌ (113*) సెంచరీతో, గ్లెన్‌ ఫిలిప్స్‌ (94*) అజేయంగా నిలిచారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 173 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి సెషన్‌లో నాలుగు వికెట్లు తీసిన భారత్‌, ఆ తర్వాత ఒక్క వికెట్‌ మాత్రమే పడగొట్టింది. బుమ్రా 3, అన్షుల్‌ కాంబోజ్‌, ఆకాశ్‌దీప్‌ చెరో వికెట్‌ తీశారు.

Comments

G
Loading comments...