బంగ్లాతో టెస్ట్.. గెలుపు ముంగిట సౌతాఫ్రికా

జోహన్నెస్‌బర్గ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో సౌతాఫ్రికా విజయం దిశగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో బంగ్లా 400 పరుగులకు ఆలౌట్ కాగా, అకెర్మాన్ (157), రికెల్టన్ (102) శతకాలతో సఫారీలు 557 పరుగుల భారీ స్కోరు సాధించారు.
అనంతరం 157 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 100 పరుగులు చేసి కష్టాల్లో పడింది.
Comments
Loading comments...
