Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం డబ్బులు.. ఆగస్టు 3 వరకు అవకాశం!

Follow Udayam Digital on Google
RAGHU Jul 29, 2026 9:35 AM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
తల్లికి వందనం డబ్బులు.. ఆగస్టు 3 వరకు అవకాశం! - Udayam Digital
శ్రీకాకుళం : 'తల్లికి వందనం' పథకం కింద అర్హత ఉండి కూడా డబ్బులు అందని వారు ఆగస్టు 3వ తేదీలోపు స్వర్ణ గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు దరఖాస్తులను పరిశీలించి, అనంతరం అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. కొత్తగా అర్హత సాధించిన విద్యార్థులతో పాటు ఒకటి తరగతి, ఇంటర్మీడియట్‌లో తాజాగా చేరిన వారి జాబితాలను ఆగస్టు 30వ తేదీలోపు విడుదల చేయనున్నారు. అదే రోజున తల్లుల ఖాతాల్లో రెండో విడత నగదు జమ కానుంది.

Comments

G
Loading comments...