వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు రాత్రి గరుడ సేవ వైభవంగా జరగనుంది. వేడుకను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు.
190 గ్యాలరీల్లో 1.80 లక్షల మంది భక్తులు గరుడ సేవను వీక్షించేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. పురాణాల ప్రకారం ఈ సేవను వీక్షించేందుకు ముక్కోటి దేవతలు తిరుమలకు వస్తారని విశ్వాసం.
Comments
Loading comments...

