వార్తలకు తిరిగి వెళ్లండి

తిమ్మాపూర్ మండలం పోరండ్లకు చెందిన తిరుపతి తిమ్మాపూర్లో బ్రాంచి పోస్ట్మాస్టర్గా పనిచేశాడు. ఖాతాదారుల నుంచి సుమారు రూ.15 లక్షలు మోసం చేసి పరారయ్యాడని గ్రామస్థులు ఆరోపించారు. పోస్టాఫీసులో నగదు జమ చేసిన పలువురి డబ్బులను వివిధ రకాలుగా కాజేసినట్లు బాధితులు పేర్కొన్నారు.
గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అధికారులు డబ్బులు చెల్లించినట్లు సమాచారం. తాజా ఘటనతో ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Loading comments...

