Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసభ్య ప్రవర్తన టీచర్ సస్పెండ్

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 04, 2026 3:24 PM అన్నమయ్యఆంధ్రప్రదేశ్
అసభ్య ప్రవర్తన టీచర్ సస్పెండ్ - Udayam
అన్నమయ్య జిల్లాలో విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన ఆరోపణలపై ఓ టీచర్‌ను డీఈవో సస్పెండ్ చేశారు. మదనపల్లె కోటబడి మున్సిపల్ హైస్కూల్లో షేక్ అబ్దుల్ జబ్బార్ సోషల్ టీచర్‌గా పనిచేస్తున్నారు. ఆరో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు ఫిర్యాదు చేశారు. దీంతో టీచర్‌ను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే సూచించడంతో డీఈవో చర్యలు తీసుకున్నారు.

Comments

G
Loading comments...