Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కార్మిక సమస్యలపై కలెక్టరేట్‌ వద్ద ఆందోళన

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 18, 2026 2:21 PM అన్నమయ్యGeneral
కార్మిక సమస్యలపై కలెక్టరేట్‌ వద్ద ఆందోళన - Udayam
కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సాంబశివ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, రైతు సంఘం జిల్లా కార్యదర్శి రంగారెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, 4 లేబర్ కోడ్‌లు రద్దు చేసి 44 చట్టాలు అమలు చేయాలని కోరారు. 8 గంటల పని దినం, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 12వ పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...