Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తైక్వాండో శిక్షణతో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెరుగుతాయి : ఎమ్మెల్యే

Follow Udayam on Google
Raghu Sep 30, 2026 2:03 PM శ్రీకాకుళంGeneral
తైక్వాండో శిక్షణతో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెరుగుతాయి : ఎమ్మెల్యే - Udayam
బాలికల ఆత్మరక్షణకు మార్షల్ ఆర్ట్స్ ఎంతగానో దోహదపడతాయని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం నగరంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో డీఈఓ రవిబాబు, సమగ్ర శిక్ష ఏపీసీ వేణుగోపాలరావుతో కలిసి ఆత్మరక్షణ శిక్షణను ఆయన ప్రారంభించారు. తైక్వాండో శిక్షణతో ఆత్మవిశ్వాసం, మానసిక స్థైర్యం పెరుగుతాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 387 పాఠశాలల్లో ఈ శిక్షణ అందిస్తున్నట్లు ఏపీసీ వెల్లడించారు.

Comments

G
Loading comments...