వార్తలకు తిరిగి వెళ్లండి

పెదబయలు మండలంలో బుసిపుట్టు జంక్షన్ నుంచి పిట్టగుడ్లు వరకు తారురోడ్డు నిర్మించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు 10 కిలోమీటర్ల రహదారి దెబ్బతిన్నా అధికారులు, ఐటీడీఏ పాలకులు పట్టించుకోలేదని తెలిపారు.
దీంతో గిరిజనులు సొంతంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అధికారులు స్పందించి తారురోడ్డు నిర్మించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

