వార్తలకు తిరిగి వెళ్లండి

యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి సన్నిధిలో బుధవారం ఉదయం సుప్రభాత సేవ, నిజాభిషేకం అనంతరం సహస్రనామార్చన శాస్త్రోక్తంగా నిర్వహించారు. అర్చకులు, వేద పండితులు స్వామి, అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో పూజలు చేశారు.
పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం సుమారు గంటపాటు అర్చన కార్యక్రమాలు కొనసాగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Comments
Loading comments...

